మీరు ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫోన్ పక్కనే పడుకుంటున్నారు.. దీనివల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.

ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఫోన్ పక్కన పెట్టుకుంటే దాని నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై పడటం వల్ల మనసును రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లనివ్వదు.

ఇది కంటిచూపుపై తీవ్ర దుష్ర్పభావం పడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

కొందరు పాటలు వింటూ నిద్రపోతారు.. ఇలా పడుకోవడం వల్ల దాని నుంచి విడుదలయ్యే రేడియేషన్ తలనొప్పి, కండరాల నొప్పులు వస్తాయి.

ఫోన్ పక్కనే పెట్టకుని పడుకోవడం వల్ల దాని నుంచి విడుదలయ్యే హానికరమైన రేడియేషన్ మన మెదడును దెబ్బతీస్తాయి.

 à°…న్నింటికన్నా ముఖ్యంగా ఫోన్ మీ పక్కనే ఉంచడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు.

మీరు పడుకునే సమయంలో ఫోన్‌ను కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచడం మంచిది.

అలాగే పడుకోడానికి గంట ముందే ఫోన్ పక్కన పెట్టడం చాలా మంచిదంటున్నారు.