సైజులో చిన్నవే కాని ప్రమాదకరం.. విషపూరిత జంతువులు ఇవే
చూడడానికి చిన్నగా ఉన్నా ఒక కాటుతో ప్రాణం తీసే జంతువులు ఈ ప్రకృతిలో ఉన్నాయి.
పాయిజన్ డార్ట్ ఫ్రాగ్.. 2 ఇంచుల సైజు మాత్రమే ఈ కప్ప చర్మం అంతా విషపూరితమే.
జెల్లీ ఫిష్.. సముద్రంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ ని చేత్తో అజాగ్రత్తగా పట్టుకుంటే విష కాటు వేస్తుంది.
స్టోన్ ఫిష్.. 13 ఇంచులు మాత్రమే ఉండే ఈ రాతి లాంటి చేప వెన్నెముకలో నిండా ప్రమాదకర విషమే.
పఫర్ ఫిష్.. ఈ చిన్న చేపను చాలా దేశాల్లో ఇష్టంగా తింటారు. కానీ దీని శరీరంలోని విషాన్ని జాగ్రత్తగా తొలగించాలి.
గిలా మాన్‌స్టర్ బల్లి.. ఈ బల్లి చిన్నదిగా ఉన్నా కాటు వేస్తే దీని దవడల్లో ఉన్న విషం చాలా ప్రమాదకరం.