ప్రతి సీజన్ లో ప్రకృ‌తి మనకు వెరైటీ ఫ్రూట్స్ ప్రసాదిస్తుంది. వాటిలో మినరల్స్ , విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి

వేసవిలో లభించే కొన్ని ఫ్రూట్స్ వల్ల బరువు తగ్గాలనేవారికి బాగా ఉపకరిస్తాయి.

పుచ్చకాయ్.. ఇందులో కెలోరీలు తక్కువ, మినరల్స్ ఎక్కువ. ఇది తింటే ఎక్కువగా ఆకలి వేయదు.

పీచెస్.. ఇందులోని విటమిన్ ఎ, సి తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. వెయిట్ లాస్‌కు ఇవి బాగా ఉపకరిస్తాయి.

మస్క్ మెలన్.. అంటే కర్బూజా. ఇందులో మినరల్స్, విటమిన్స్ వంటి  పోషకాలు బాగా ఎక్కువ. త్వరగా కడుపునిండిపోతుంది.

పైనాపిల్.. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తి బాగా పెంచుతుంది. ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది.

లోకోఆట్.. ఇందులో జ్యూస్ కంటెంట్ లో ఫైబర్ బాగా ఎక్కువ. దీని వల్ల జీర్ణక్రియ వేగంగా జరిగి బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

ఫ్రూట్స్ తోపాటు కూరగాయల్లో కుకుంబర్ కూడా బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది.