మీకు బ్లూ టీ తెలుసా? తాగితే.. నాజూగ్గా మారిపోతారు!

 à°¶à°‚ఖు పుష్పం.. దీన్ని దేవతార్చనలో ఎక్కువగా వాడుతుంటాం.. ఇది పూజలో ఎంత పవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ భావిస్తుంటారు.

శంఖుపుష్పాల టీ తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ టీని ఎండిన పుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది.

దీనిలో యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.

ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. దీనిలోని యాంటీహైపెర్లిపిడెమిక్ లక్షణాలు కొలెస్ట్రాల్ వాల్యూమ్‌లను, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి.

 à°ˆ టీ రోజూ తాగితే.. దృష్టి, కంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

శంఖు పుష్పాల టీ మెదడు ఆరోగ్యానికి, ఆందోళన, నిరాశకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో వాడుతుంటారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం.