టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బర్త్ డే స్పెషల్

కేఎల్ రాహుల్ ఏప్రిల్ 18, 1992 కర్ణాటకలో జన్మించాడు.

కేఎల్ రాహుల్ 19 సంవత్సరాల వయసులోనే క్రికెట్ రంగంలో అడుగుపెట్టాడు.

2014 లో టీమిండియా తరుపున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.

ప్రస్తుతం ఐపీఎల్ - 2024తో బిజీగా ఉన్నాడు. లక్నో జట్టును కేఎల్ రాహుల్ విజయపథంలో నడిపిస్తున్నాడు.

వన్డే అరంగేట్రంలోనే సంచరీ చేసిన ఏకైక ఇండియన్ బాట్స్ మెన్ కేఎల్ రాహుల్. జూన్ 2016 లో జింబాబ్వేపై రాహుల్ ఈ ఘనత సాధించాడు.

మార్చి 2017 నుంచి ఆగస్టు 2017 వరకు టెస్టు క్రికెట్ లో వరుసగా  7 అర్ధశతకాలు సాధించిన ఘనత కేఎల్ రాహుల్ కే సొంతం.

ఇక ఇప్పటి వరకు టీమిండియా తరుపున 50 టెస్టులు, 75 వన్డేలు, 72 టీ 20 లు ఆడాడు.

కేఎల్ రాహుల్ ఇటీవల బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు.