బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్  భారతదేశానికి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

అసలు నటుడిగా పనిరాడు అన్న అమితాబ్ ఇప్పుడు  బిగ్ బీగా  ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు

నేడు అమితాబ్ బచ్చన్ తన 82 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు

అమితాబ్ కు, తెలుగుకు  విడదీయరాని  అనుభందం ఉంది. ఇప్పటివరకు అమితాబ్ తెలుగులో నటించిన సినిమాలు ఏంటి అనేవి చూద్దాం

గులాబి సినిమాకు నిర్మాతగా అమితాబ్ బచ్చన్ వ్యవహరించారు

గులాబి సినిమాకు నిర్మాతగా అమితాబ్ బచ్చన్ వ్యవహరించారు

అమృత వర్షం సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో కనిపించారు

నాగార్జున ఫ్యామిలీ మొత్తం నటించిన మనం సినిమాలో అమితాబ్ ఒక గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించారు

సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవికి గురువుగా అమితాబ్ నటించారు

ఇక కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ నటించారు అనడం కన్నా జీవించారు అనే చెప్పాలి

ప్రస్తుతం అమితాబ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. త్వరలోనే కల్కి 2 తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు