దేశంలో బడ్జెట్ మార్కెట్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ఈ సెగ్మెంట్ తన స్థానాన్ని నిలుపుకునేందుకు అనేక కంపెనీలో పోటీపడుతున్నాయి.

టెక్నో తన స్పార్క్ సిరీస్‌లో కొత్త బడ్జెట్ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్షన్ 6080 ప్రాసెసర్ ఉంటుంది.

108MP ప్రైమరీ రియర్ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

టెక్నో స్పార్క్ 20 ప్రో 5G  8 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 15,999 రూపాయలు.

ఈ డివైస్ సేల్ జూలై 11 నుంచి అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతుంది.

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI చెల్లింపుల ద్వారా లిమిటెడ్ ఆఫర్ కింద రూ. 2000 అదనపు క్యాష్‌బ్యాక్‌తో అందిస్తోంది.

టెక్నో Spark 20 ప్రో 5G అనేది కంపెనీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీని బ్యాక్ పెద్ద కెమెరా మాడ్యూల్ ఉంది.

ఫోన్ స్టార్‌ట్రైల్ బ్యాక్, గ్లోసీ వైట్ కలర్‌లో వస్తుంది.