ఆహారంలో శొంఠి ఉంటే, ఆనందం, ఆరోగ్యం మీ వెంటే..

 శొంఠి అని పిలువబడే దీనిని డ్రై జింజర్ లేదా పొడి అల్లం అనీ కూడా పిలుస్తారు.

శొంఠి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శొంఠి జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇది బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

శొంఠి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

 దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో శోథను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది మైగ్రెన్ నొప్పుల తీవ్రతను, వికారం, వాంతులను తగ్గించడంలో సహాయపడుతుంది.

శొంఠిని పొడి రూపంలో, కషాయం, లేదా వంటలలో మసాలాగా ఉపయోగించవచ్చు