ఏనుగును సైతం చంపగలిగే ఎలుక ఇదే..
ఆఫ్రికన్ క్రెస్టెడ్ ర్యాట్.. దీన్ని మేన్డ్ ర్యాట్ (జూలు గల ఎలుక) అని కూడా అంటారు.
ఎలుక జాతిలో ఇది ఒక్కటే విషపూరితమైనది. మొక్కల నుంచి ప్రమాదకర విషం తింటుంది.
ఈ విషమే ఈ క్రెస్టెడ్ ర్యాట్ ప్రత్యేకత. ఒక్కసారి కొరికితే ప్రాణాలు పోవడం ఖాయమే.
ఆఫ్రికాలో లభించే ఆకోకంథేరా స్కింపెరీ అనే విషపు మొక్కను ఈ ఎలుక ఆహారంగా తింటుంది.
ఈ మొక్కలోని వేర్లు, గింజలు, ఆకుల్లో ఆకోవెనెసైడ్, ఓవాబైన్ అనే విషపు రసాయనాలుంటాయి.
ఈ ఎలుక చర్మ మందంగా, ఎముకలు చాలా బలంగా ఉంటాయి.
ఎలుకను తినేందుకు జంతువులు ప్రయత్నిస్తే.. పళ్లతో ఒక్కసారిగా కొరికేస్తుంది.
క్రెస్టెడ్ ర్యాట్ కొరికితే ఏనుగు లాంటి పెద్ద జంతువైనా కుప్పకూలాల్సిందే.