శరీరానికి నిద్ర చాలా అవసరం. తక్కువ నిద్ర వల్ల మనిషి ఫోకస్ చేయలేడు.

కానీ చదువుకునే సమయంలో పూర్తిగా ధ్యానం కేంద్రీ కరించాలి.

అదే పుస్తకం చేతిలో పట్టుకుంటే నిద్ర వెంటనే వచ్చేస్తుంది. దీన్ని నివారించాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.

ముందుగా ప్రతిరోజు 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి.

చదువుకునే సమయంలో నిటారుగా కూర్చోవాలి. రిలాక్స్ గా కూర్చుంటే నిద్ర మెల్లగా వచ్చేస్తుంది.

ప్రతిరోజు నీరు బాగా తాగాలి. శరీరంలో నీరు తక్కువైతే అలసట వస్తుంది. దీంతో శరీరం నిద్ర కోరుకుంటుంది.

మితంగా భోజనం చేయాలి. ఎక్కువగా భోజనం చేస్తే త్వరగా నిద్ర వస్తుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్ తినాలి.

మంచి వెలుతురు ఉండే వాతావరణంలో చదువుకోవాలి. లేకపోతే కళ్లు మెల్లగా మూసుకుపోతాయి.

చదువుకుంటూ మధ్యలో కాసేపు విరామం తీసుకొని వాకింగ్ చేయండి.