హ్యాంగ్ ఓవర్ నుంచి త్వరగా కోలుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి
రాత్రి మద్యం సేవించి పడుకుంటే నిద్రలేవగానే ముందు నీరు బాగా తాగాలి.
నిమ్మకాయ రసంలో లేదా టీ లో అల్లం తప్పకుండా వేసుకొని తాగాలి.
అరటిపండులోని పొటాషియం బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం ఉదయాన్నే ఒక పండు తినేయండి.
నీరసంగా ఉంటే కాసేపు మళ్లీ పడుకోండి. శరీరం యాక్టివ్ గా ఉండేందుకు నిద్ర ఉపకరిస్తుంది.
రాత్రి మద్యం సేవించే ముందు బాగా సలాడ్ తినండి.
కార్బోహైడ్రేట్స్ ఉండే పోషకాహారం తింటే తలనొప్పి తొందరగా నయమవుతుంది.
తప్పనిసరిగా టిఫిన్ చేయండి, జ్యూస్ లేదా ఓఆర్ఎస్ తాగండి