అమ్మాయిలు ఫంక్షన్లు, పండగల సమయంలో అందరికంటే తాము కాస్త ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల దుస్తులతో పాటు, మేకప్ కూడా వేసుకుంటారు.

ముఖ్యంగా మేకప్‌లో ఐ మేకప్ అందాన్ని రెట్టింపు చేస్తుందనే చెప్పొచ్చు. ఐ మేకప్ వేసేటప్పుడు కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే మీ లుక్ డబుల్ అవుతుంది.

మరి క్లాసీ ఐ మేకప్ కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి సమయంతో పాటు ఆ తర్వాత కూడా అందంగా కనిపించాలంటే నూతన వధువులకు ఐ మేకప్ తప్పనిసరి.

 ఇందుకోసం ముఖ్యంగా న్యూడ్ కలర్స్ ఎంచుకోవడం మంచిది. ఐ లైనర్ వాడి మీరు ఈ సమయంలో మరింత గ్లామరస్‌గా కనిపించవచ్చు.

ఈ రోజుల్లో స్మోకీ ఐస్ ట్రెండ్ కొనసాగుతోంది. మీరు ఒక వేళ డిజైనర్  లేదా హెవీ సారీ ధరించినట్లయితే స్మోకీ ఐ మేకప్ మీకు చాలా బాగుంటుంది

లైట్ న్యూడ్ షేడ్‌తో కాజల్: చీర అయినా సూట్ అయినా మీకు క్లాసీ లుక్ కావాలంటే తప్పకుండా కాజల్ వాడాల్సిందే.

నేచురల్ లుక్ కోసం మీ కళ్లకు కన్సీలర్‌తో కాజల్, లైనర్ అప్లై చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు.