తలనొప్పిని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కునే ఉంటారు.

తలనొప్పి అనేది ఒత్తిడి, అలసట, నిద్ర లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల వచ్చే ఒక సాధారణ సమస్య.

తలనొప్పిని మందులు లేకుండా కూడా  ఇంట్లోనే నయం చేసుకోవచ్చు.

లెమన్ టీ: నిమ్మకాయ తలనొప్పిని తగ్గించడంలో  చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

లెమన్ టీ తయారు చేయడానికి  ఒక కప్పు నీళ్లలో కాస్త లెమన్ జ్యూస్ వేసి మరిగించి తర్వాత వడగట్టి తాగాలి.

దీని రుచి,  వాసన మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది.

తులసి ఆకులు: తులసి ఆకులు సహజ నొప్పి నివారిణి. కండరాల ఉపశమనకారిగా ఇవి పరిగణించబడతాయి.

 తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ టీ త్రాగాలి.

తులసి ఆకులను పేస్ట్  లాగా చేసి తలకు పట్టించాలి. ఈ రెమెడీ కూడా తలనొప్పిని తగ్గిస్తుంది .

తులసి టీ  మీ శరీరానికి  ప్రశాంతతను కలిగిస్తుంది.