ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా ఇందుకోసం అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు.
మేకప్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. అంతే కాకుండా స్పెషల్ అట్రాక్షన్ను ఇస్తుంది.
మేకప్ వల్ల మీ లుక్ మారడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
కానీ చాలా సార్లు మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వీటి వల్ల స్కిన్ పాడవుతుంది.
మేకప్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు మీరు నాన్ కాయెడోజెనిక్ ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోండి.
మేకప్ చేసుకోవడానికి ముందు మీ ముఖం చేతులను తప్పకుండా శుభ్రం చేసుకోండి.
ఒక వేళ ఇలా చేయకుండా మేకప్ వేసుకుంటే మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మేకప్ వేసుకునేముందు ముఖాన్ని మాయిశ్ఛరైజ్ చేయడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల ముఖం పొడిబారదు.
మేకప్ వేసుకునేటప్పుడు తొందరలో కొందు బ్రష్లను శుభ్రం చేయడం మరిచిపోతారు.
శుభ్రంగా లేని బ్రష్ల వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.