నేటి బిజీ లైఫ్‌లో ఒత్తిడి సర్వ సాధారణమైపోయింది.మానసిక ఆరోగ్యం క్షీణించడంలో ఒత్తిడి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ఎక్కువ ఒత్తిడికి లోనవడం కూడా మన పని తీరుపై ప్రభావం చూపుతుంది.

ఒత్తిడిని నియంత్రించడంలో కొన్ని సహజ పద్ధతులు మీకు బాగా ఉపయోగపడతాయి

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ప్రధాన 5 మార్గాలను తెలుసుకుందాం.

యోగా, మెడిటేషన్: యోగా ,ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయి.

ప్రకృతికి దగ్గరగా సమయం గడపడం  ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరో మార్గం.

తగినంత నిద్ర పొందండి: నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుంది.

శారీరక శ్రమ చేయండి: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది

సానుకూలంగా ఆలోచించండి: ప్రతికూల ఆలోచనలను మీ మనస్సు నుండి దూరంగా ఉంచండి.

సంగీతాన్ని వినండి: ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన సంగీతం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.