వేసవికాలం అంటేనే ఉక్కపోత, చిరాకు వస్తాయి.

సమ్మర్లో ఎక్కువమంది అలర్జీ, చెమటకాయల సమస్యలను ఎదుర్కొంటారు.

చెమట గ్రంథులు మూసుకుపోయినపుడు శరీరంపై చెమటకాయలు వస్తాయి.

చిన్న చిన్న నీటిపొక్కుల్లా ఉండే ఇవి.. చర్మంపై మంట, దురదలను కలుగజేస్తాయి.

రోజ్ వాటర్ కు సమానంగా తేనె కలిపి.. దానిని ఫ్రీజ్ చేశాక చెమటకాయలపై అప్లై చేస్తే తగ్గుతాయి.

గంధం శరీరాన్ని చల్లగా ఉంచుకుంది. పాలలో గంధం కలిపి.. దానిని ముఖం, చేతులపై అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

మర్రిచెట్టు పౌడర్ చెమటకాయల్ని తరిమేస్తుంది. చెమటకాయలపై దీనిని రాస్తే త్వరగా ఉపశమనం పొందుతారు.

వేపఆకుల పేస్ట్ కూడా చర్మవ్యాధుల నుంచి కాపాడుతుంది.

కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి శరీరాన్ని సహజంగా చల్లబరిచేవి తాగుతుండాలి.