పరుగులు తీసే జీవనంలో మానసిక ఒత్తిడి ఉండడం చాలా సహజం.

కానీ ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై కూడా ఉంటుంది.

అందుకే ఆరోగ్యంగా ఉండాలంగే మానసిక ఒత్తిడిని జయించాలి.

ఒత్తిడి నుంచి దూరంగా ఉండడానికి కొన్ని టిప్స్ మీ కోసం.

ధ్యానం కేంద్రీ కరించడం. ఎన్ని పనులున్నా ఫోకస్ కోల్పోకుండా చేయాలి.

ప్రతి రోజూ మెడిటేషన్ చేయండి. 10 నిమిషాలు కళ్లుమూసుకొని ఏదీ ఆలోచించకుండా చేయండి.

కండరాలకు మసాజ్ చేసుకోండి. కీలక కండరాలకు 10 నిమిషాల పాటు ప్రెస్ చేస్తూ వదులుతూ ఉండండి.

చూయింగ్ గమ్ 10-15 నిమిషాలు నమిలితే శరీరంలో ఒత్తిడి కలిగించే కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి.

కోల్డ్ థెరపీ.. ముఖాన్ని చల్లని నీటితో కడగండి లేదా ఐస్ ప్యాక్‌ ముఖానికి 30 సెకండ్లపాటు అంటిపెట్టండి.

డైరీ రాయండి. మీ ఆలోచనలు, సమస్యల గురించి రాయండి. అలా చేస్తే పరిష్కార మార్గం లభించే అవకాశముంది.

ప్రతిరోజు ఒకే సమమానికి నిద్రపోండి. 7-9 గంటల గాఢ నిద్ర ఆరోగ్యానికి మంచిది