న్యూ ఇయర్ పార్టీ హ్యాంగ్ ఓవర్ నుంచి త్వరగా కోలుకోవడానికి ఈ టిప్స్
న్యూ ఇయర్ పార్టీలో మద్యం సేవించిన తరువాత రోజు హ్యాంగ్ ఓవర్ పట్టి పీడిస్తుంది.
మద్యం సేవిస్తే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అందుకే వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.
కోడి గుడ్లు, ఫ్రూట్, ఓట్ మీల్స్ లాంటి టిఫిన్ చేస్తే.. త్వరగా శరీరానికి బలం చేకూరుతుంది.
మద్యం కారణంగా విటమిన్స్, మినరల్స్ కోల్పోతారు. అందుకే స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా ఓఆర్‌ఎస్ తాగండి.
మరుసటి రోజు శరీరానికి కాస్త విశ్రాంతి నివ్వండి.
టీ, కాఫీలు తాగొద్దు.. వేటి నీటిలో అల్లం మరిగించి తాగండి మేలు చేస్తుంది.
కాస్త దూరం వీలైతే వాకింగ్ చేయండి.