పసిడి ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గోల్డ్ రేట్స్ పెరిగి పోతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్ల గ్రామ్ బంగారం రేటు కూడా లక్ష మార్క్ దాటేసింది.

ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 24 వేలకు చేరుకుంది.

తక్కువ సమయంలోనే ఇది లక్షా 50 వేలకు చేరుతుందని అంచనా.

నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,920 రూపాయలు.. కాగా నేడు ఇది 1,24,150 కి చేరుకుంది.

అంటే  ఒక్క రోజులోనే బంగారం ధర తులంపై రూ. 200 పెరిగింది.

ఇదిలా ఉంటే.. బంగారం లాగానే వెండి ధరలు కూడా  అమాంతం పెరుగుతున్నాయి.

బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,70,000 కాగా.. గురువారానికి 1,71,000 కి చేరుకుంది.

వెండి ధర ఒక్క రోజులోనే  వెయ్యి రూపాయలు పెరిగింది.