త్రిష... మీ పెళ్లి ఎప్పుడు... ఇంకా ఆగని రూమర్స్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రశ్న తెగ వైరల్ అవుతుంది.
దీనికి కారణం ఎవరో కాదు.. హీరోయిన్ త్రిషనే అని చెప్పొచ్చు.
సరిగ్గా వారం కిందట త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది.
అది ఏంటంటే... "ఎప్పటికైనా ప్రేమదే అంతిమ విజయం" అని పెట్టింది.
ఈ పోస్ట్ చూసిన తర్వాత త్రిష ప్రేమ విజయతీరాలను తాకిందని, అందుకే ఆ పోస్ట్ పెట్టిందని అనుకున్నారు.
లవ్ సక్సెస్ అయింది.. ఇక పెళ్లి ఎప్పుడు అనే క్వశ్చన్ వచ్చింది.
వారం రోజులు గడుస్తున్నా... ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అనే క్లారిటీ మాత్రం త్రిష ఇవ్వలేదు.
కానీ, సోషల్ మీడియాలో ఇప్పటికీ త్రిష మ్యారేజ్ త్వరలోనే అది కూడా లవ్ మ్యారేజ్ అంటూ గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.
ఈ గాసిప్స్‌కు చెక్ పడాలంటే... త్రిష ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో స్పందించాల్సిందే.
ట్రంప్ సుంకాలతో ఈ వస్తువుల ధరలకు రెక్కలు