కేంద్ర బడ్జెట్ గురించి ఈ కీలక విషయాలు తెలుసా
ప్రతీ సంవత్సరం భారత ఆర్థిక మంత్రి పార్లమెంటులో కేంద్రబడ్జెట్ సమర్పిస్తారు.
బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని బౌగెట్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం చిన్న బ్రీఫ్‌కేస్.
1860లో భారతదేశ మొదటి బడ్జెట్ బ్రిటీష్ అధికారి జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. ఆయనే ఆదాయపన్ను రూపకర్త.
ఏప్రిల్ 1న మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి ముందు సవరణలకు అవకాశం కల్పించేందుకే ఫిబ్రవరి 1 బడ్జెట్.
1955లో కాంగ్రెస్ ప్రభుత్వం హిందీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇంగ్లీషు, హిందీ భాషలలో బడ్జెట్ లభ్యం.
బడ్జెట్ రూపకల్పన పూర్తయ్యే కార్యక్రమానికి ప్రతీకగా దాని రూపకర్తలు హల్వా వేడుక చేసుకుంటారు.
2021 నుంచి ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ని డిజిటల్ రూపంలో ఒక టాబ్లెట్‌లో సమర్పిస్తున్నారు.
1999కి ముందు కేంద్ర బడ్జెట్‌ని సాయంత్రం 5 గంటలకు సమర్పించేవారు. కానీ 1999లో తొలిసారి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు.