వేసవిలో చల్లదనం కోసం బీరు తాగొచ్చా?

వేసవిలో చల్లగా బీర్ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.

 చల్లని బీర్ తాగడం వల్ల తాపానికి కొంత ఉపశమనం లభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు.

కానీ, ఇది నిజంగానే ఆరోగ్యానికి మంచిదా?

చల్లని బీర్ తాగడం వల్ల కొంతకాలం పాటు శరీరం చల్లగా అనిపించవచ్చు.

బీర్ తాగడం వల్ల దాహం త్వరగా తీరుతుందని కొందరు భావిస్తారు.

బీర్‌లోని ఆల్కహాల్ శరీరంలో నీటిని త్వరగా బయటకు పంపుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది.

బీర్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి అధికంగా తాగడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

అధికంగా బీర్ తాగడం వల్ల గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి బీర్ కంటే నీరు, పండ్ల రసాలు, నిమ్మరసం, పుదీనాతో కూడిన నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలు మంచివి.

సమ్మర్ లో బీర్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అనేక రకాల సమస్యల బారిన పడతారు