ప్రపంచ దేశాల్లో విచిత్ర పెళ్లి సంప్రదాయాలు ఇవే..

జర్మనీలో పెళ్లికి ముందురోజు ఇంట్లోని పోర్సిలీన్ ప్లేట్లను పగలగొట్టి దుష్టశక్తులను తరిమికొడతారు.

స్విడెన్ దేశంలో వరుడు లేదా వధువు పెళ్లి రోజు ఒంటరిగా కనిపిస్తే వారిని మిగతా వారు ముద్దాడవచ్చు.

భారతదేశంలో పెళ్లికూతురు చెల్లెలు వరుడి షూస్ దొంగిలించి తిరిగివ్వడానికి డబ్బులు అడుగుతుంది.

దక్షిణ కొరియా పెళ్లికొడుకు కాళ్లపై చేపలతో కర్రతో కొడతారు. ఇది వారి శరీర సామర్థ్యానికి పరీక్ష అట.

ఇండోనేషియాలో కొత్తగా పెళ్లైన జంట మూడు రోజుల వరకు బాత్రూం వెళ్లకూడదు.

కెన్యాలోని మస్సాయి తెగలో వధువు తలపై, ఛాతిభాగంపై ఆమె తండ్రి ఉమ్మి వేస్తారు. ఇది ఒక ఆశీర్వాదమట.

స్కాట్లాండ్ లో వధూవరుల శరీరాలకు బూడిద, గోధుమపిండి, కోడిఈకలు పూసి ఊరంతా తిప్పుతారు.

ప్రపంచ దేశాల్లో విచిత్ర పెళ్లి సంప్రదాయాలు ఇవే..