స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo దాని ఫేమస్ Y సిరీస్‌ ఫోన్లను విస్తరించే పనిలోపడింది.

ఈ క్రమంలోనే Y సిరీస్ లైనప్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y200 Proను విడుదల చేసింది.

Vivo ఈ ఫోన్ చాలా స్టైలిష్, స్లిమ్‌గా ఉంటుంది.

Vivo Y200 Pro 6.78-అంగుళాల 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇది పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 nits పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసర్‌తో వస్తుంది.

ఇందులో 8GB RAM+128GB స్టోరేజ్ ఉంటుంది. ఇది 8GB వరకు వర్చువల్ RAMకి సపోర్ట్ ఇస్తుంది.

OIS మద్దతుతో 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2-మెగాపిక్సెల్ బోకె సెన్సార్ ఉన్నాయి.