పెళ్లిల్లు, ఫంక్షన్స్‌లో కుర్చీలు, బల్లలు వేసి విందు భోజనాలు పెట్టేవారు.

కానీ ఇప్పుడు ‘బఫె’ పేరుతో మీకు మీరే వడ్డించుకొని తినండి అంటున్నారు.

ఆఫీసుల్లో కూడా స్పేస్ సేవ్ చేయడానికి బఫేనే ఎంచుకుంటున్నారు.

మరి, నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అలా తింటే ఏమవుతుంది?

నిలబడి తినడంపై భిన్న వాదనలు ఉన్నాయి.

నిలబడి తింటే త్వరగా జీర్ణమవుతుందట.. కొవ్వు పెరగదట.

అయితే, కడుపు ఉబ్బరం, బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట.

కొందరికి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల గుండెల్లో మంట, గ్యాస్ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.

ఆయుర్వేదం ప్రకారం.. నేల మీద కూర్చొని తినడం శ్రేయస్కరం.