కాజల్: ఈమెకు ఎన్జీవో లేదు. కానీ, ఓ అమ్మాయి చదువుకు రూ.లక్ష సాయం చేసింది.

సదా: ఈమె జంతు ప్రేమికులురాలు. సమయం దొరికినప్పుడు సామాజిక సేవల్లో పాల్గొంటుంది.

పూజా హెగ్డే: ‘ఆల్‌ అబౌట్‌ లవ్‌’ అనే సేవా సంస్థ ద్వారా పిల్లలకు వైద్య, ఆర్థిక సాయం అందిస్తోంది.

ప్రణీత: కర్ణాటకలో స్కూళ్లను దత్తత తీసుకుని నవీకరిస్తోంది.

అనుష్క శెట్టి: ఎవరికి సాయం చేయాలన్నా ముందు ఉంటుంది.

కీర్తి సురేష్: గతంలో కేరళ ఫ్లడ్ రిలీఫ్‌లో చురుగ్గా పాల్గొంది. అడిగినవారికి కాదనకుండా సాయం చేస్తుంది.

సమంత: ప్రత్యుష ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు సాయం చేస్తోంది.

కృతిశెట్టి: పేదలను ఆదుకోడానికి ‘నిష్న- ఫీడ్ ది నీడ్’ అనే సంస్థ ప్రారంభించింది.