మనిషి చర్మ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మంపై పులిపిర్లు లేదా బొడిపెలు వస్తుంటాయి.

ఇవి ఎందుకు వస్తాయో కచ్చితమైన కారణాలు లేవు. అయితే ఏ స్థానాల్లో వస్తాయో తెలిసి అంచనా వేయగలం.

ఈ బొడిపెలు చర్మంపై వచ్చే చిన్న కణతులు. వీటి వల్ల ఎటువంటి హాని ఉండదు.

కానీ అందవిహీనంగా ఉంటాయి. ఇవి చర్మం కలర్ లేదా అంతకంటే డార్క్ కలర్ లో ఉంటాయి.

చర్మం రాపిడికి గురయ్యే మెడ, సంకలు, ప్రైవేట్ భాగాలకు సమీపంగా వస్తాయి

కొన్నిసార్లు వీటికి జువెలరీ లాంటివి ఏదైనా తగిలితే చర్మంలో దురదగా ఉంటుంది.

వంశపార్యంపరంగా, డయాబెటీస్, గర్బవతిగా ఉన్నప్పుడు ఇవి చర్మంపై పుట్టుకొస్తాయి.

లేజర్ చికిత్స, రేడియా ఫ్రీక్వెన్సీ లేదా చిన్న సర్జరీలోతోనే వీటిని తొలగించగలము.