బలపాలు కమ్మగా ఉన్నాయని తింటే.. మీ పని మటాష్..

బలపాలు తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

బలపాలు తినడం వల్ల పిల్లలు సరైన ఆహారం తీసుకోరు. దీనివల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందక బలహీనంగా మారుతారు.

 దీనివల్ల ఐరన్, కాల్షియం లోపం ఏర్పడి రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంది.

బలపాలు  జీర్ణంకావు. కడుపులో నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి.

బలపాలను సున్నంతో కలిపి తయారుచేస్తారు. ఈ సున్నం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

 కానీ పిల్లలు స్లేట్ స్టిక్స్‌ను ఎక్కువగా తింటారు. దీనికి కారణం.. వారి శరీరంలో ఐరన్ లోపం ఉండటడే.

ఇక మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో బలపాలను తినడం కూడా ఉంది.

అలాగే దీన్ని తినడం వల్ల డయేరియా, రుతుస్రావం ఆలస్యం కావడం, కడుపులో కణితులు వంటి సమస్యలు కూడా వస్తాయి.

బలపాలను తినడం వల్ల దంతాలు అనారోగ్యం బారిన పడతాయి. దీని వినియోగం దవడపై ప్రభావం చూపుతుంది.