జామకాయ తిన్నారంటే చాలు.. ఆస్పత్రికి వెళ్లే అవసరం రాదు..

జామకాయ తినడం వల్ల బీజీ జీవితంలో అవసరమైన పోషకాలను సరఫరా చేయడానికి ఈ పండ్లు బాగా పనిచేస్తాయి.

జామ పళ్లలో విటమిన్ ఏ, బి, సి, కాల్షియం, పాస్పరస్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ పొటాషియం లభిస్తాయి.

షుగర్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన కాయ.. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా జామ పనిచేస్తుంది.

ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పికి జామ దివ్యౌషధంలా పనిచేస్తుంది.

గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందడంతోపాటు సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది.

జామకాయలో విటమిన్ సి, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దీనిలో లైకోపిన్ ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడుతుంది.

ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి, చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

జామ ఆకులు నమిలితే పంటి నొప్పులు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది.

కీళ్లవాపు నొప్పులు ఉన్నవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్న చోట కడితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.