కేథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం తరువాత కొత్త పోప్‌గా లియో XIV ఎన్నికయ్యారు.
ఆయన అసలు పేరు కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్. ఆయన లాటిన్ అమెరికాలో మిషనరీ లీడ్ చేస్తున్నారు.
అమెరికాలోని చికాగోకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ఫ్రాన్సిస్ తనకు కొత్త పేరుగా లియో XIV అని పెట్టుకున్నారు
పోప్ పదవి చేపట్టిన తొలి అమెరికన్ కూడా ఈయనే కావడం విశేషం.
ఆయన పెరులో ఎక్కువ కాలం క్రైస్తవ మిషినరీ లీడ్ చేయడంతో ఆయనను అందరూ లాటిన్ అమెరికరన్ గా గుర్తిస్తారు.
ఆయన వల్లినోవా యూనివర్సిటీ నుంచి మేథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
అలాగే యూనియన్ ఆఫ్ చికాగో నుంచి డిప్లొమా ఇన్ థియోలాజీ చేశారు.
ఆయన రోమ్ కు వెళ్లి కెనన్ చట్టం అభ్యసించి దాన్ని పెరులో బోధించారు.
రాబర్డ్ ఫ్రాన్సిస్‌గా ఆయన పెరులోని ట్రుజిల్లోలో ఒక టీచర్ గా ఒక పాస్టర్ గా సేవలు అందించారు.
ఆయన అగస్టినియర్ ఆర్డర్ సభ్యుడిగా పనిచేశారు.
గతించిన పోప్ ఫ్రాన్సిస్ ఆయనను బిషప్స్ నియామక మండలిలో సభ్యుడిగా నియమించారు.
కొన్ని నెలల కాలంలోనే ఆయన బిషప్ నుంచి ఆర్చ్ బిషప్ గా పదోన్నతి సాధించారు.
వేసవిలో పిల్లలతో కలిసి ఈ సినిమాలు చూడండి