దంచికొడుతున్న ఎండల్లో చర్మ సమస్యలు వేధిస్తున్నాయా?

వేసవిలో ఓవైపు ఎండవేడి, చెమట, ఉక్కపోత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరో వైపు చర్మ సమస్యలు వెంటాడుతుంటాయి.

వేసవిలో మీ శరీరం చాలా తేమను కోల్పోతుంది. కావున శరీరాన్ని ఎప్పటికప్పుడు నీటితో హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.

మీరు వేసవిలో రోజూ రెండు నుంచి మూడు సార్లు స్నానం చేయాలి.

ముల్తానీ మిట్టిలో అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి వేడి దద్దుర్లు నుంచి తక్షణమే చర్మాన్ని ఉపశమనం చేస్తాయి.

చర్మ సంరక్షణలో కలబంద గుజ్జును ఉపయోగించడం వల్ల ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

పిప్పరమింట్ ఆయిల్ చర్మంపై వచ్చే వేడి దద్దుర్లు తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె వడదెబ్బ లేదా వేడి దద్దుర్లు విషయంలో చర్మాన్ని శాంతపరుస్తుంది.

వేసవిలో ఆరుబయట తిరిగే సమయాలను తగ్గించుకోవాలి.

అలాగే వేసవిలో మేకప్ గందరగోళంగా మారుతుంది. కావున మేకప్ వేయడం తగ్గించాలి.