ఫ్లయింగ్ ఫిప్.. సముద్రంలో నివసించే ఈ చేపలు గాల్లో 200 మీట్లర్ ఎత్తు వరకు ఎగర గలవు.

ఫ్లయింగ్ ఫ్రాగ్.. ఈ కప్పల కాళ్లు బాతులాగా ఉండడం వల్ల గాల్లో 50 అడుగుల ఎత్తు వరకు ఎగిరి గంతేస్తాయి.

ఫ్లయింగ్ స్కిరెల్.. ఈ ప్రత్యేక ఉడతలు.. ఒక్కసారిగా 150 అడుగల దూరం వరకు జంప్ చేయగలవు.

పారడైజ్ ట్రీ స్నేక్.. ఈ పాము తన శరీరాన్ని వెడల్పు చేసి ఎగిరితే 100 అడగుల దూరం వరకు గాల్లో ప్రయాణిస్తుంది.

ఫ్లయింగ్ లెముర్.. ఈ ప్రత్యేక జీవి తన చర్మంలో గాలిని ఒడిసి పట్టే గుణం ఉండడంతో 200 అడగుల వరకు ఎగురుతుంది.

డ్రాకో లిజర్డ్.. ఈ చిన్న బల్లి పక్కటెముకలు రెక్కలలా సాగుతాయి. అందుకే 30 అడువల వరకు జంప్ చేస్తుంది.

బట్టర్ ఫ్లై ఫిష్.. ఈ బుల్లి చేప వేటాడే జంతువుల నుంచి తప్పించుకనేందుకు సముద్రం పై భాగంతో గాల్లో ఎగరగలదు.

ఫ్లయింగ్ గెకో.. ఈ ఊసరివెల్లి జాతికి చెందిన జీవి.. కాళ్ల మధ్య అతికిన చర్మం కారణంగా సుదూరంగా ఉన్న చెట్లపైకి దూకగలవు.