ప్రయాణ సమయాల్లో చాలా సార్లు జేబు దొంగతనాలు జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటాం.

ముఖ్యంగా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటివి జరుగుతుంటాయి.

అందుకే ఈ విలువైన వస్తువుల చోరి కాకుండా కొన్ని టిప్స్ పాటించండి.

రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు అంటే రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద అలర్డ్ గా ఉండాలి.

ముఖ్యంగా మీ విలువైన వస్తువులపై ఎప్పుడూ ఓ చూపు ఉండాలి.

పక్క వారిని నమ్మవద్దు. మీకు ప్రమాదమనిస్తే తప్పకుండా జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం చేయవద్దు.

ప్రయాణం చేసే సమయంలో క్రాస్ బాడీ బ్యాగ్ తీసుకెళ్లడం మంచిది. వీటిలో నుంచి చోరీ చేయడం కష్టం.

విలువైన వస్తువులు ఎప్పుడూ మీ వద్దనే ఉండాలి. వాలెట్, పర్సు దుస్తుల లోపల ఉండాలి.

పబ్లిక్ ప్లేస్ లో నగలు, క్యాష్ బయటికి తీయవద్దు. దీంతో చుట్టుపక్కల దొంగల చూపు దానిపై పడుతుంది.

ఒకవేళ మీ వస్తువులు దొంగతనం జరిగినా.. వెంటనే పోలీసులకు తెలిపి.. క్రెడిట్ కార్డులు రద్దు చేయించండి.