కొందరికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. సమాచారం, జ్ఞానం పొందడానికి ఈ అలవాటు ఉపకరిస్తుంది.

పుస్తకం చదివితే ఒత్తిడి కూడా దూరమవుతుంది. పదజాలం, ఊహా శక్తి కూడా మెరుగుపడుతుంది.

అందుకే పుస్తకాలను ప్రేమించే వారి కోసం ప్రపంచంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలున్నాయి.

టోక్యోలో బెడ్ అండ్ బుక్.. ఇక్కడ 4000 పుస్తకాలతో పాటు పడుకోవడానికి కూడా వసతులున్నాయి.

రాయల్ పోర్చుగీస్ కేబినెట్.. రియో డి జెనెరోలో మూడు అంతస్తుల భారీ భవనం ఉంది.

ఇక్కడ 3.5 లక్షల పుస్తకాలు గది పై కప్పు వరకు అమర్చి ఉంటాయి.

వేల్స్ లోని హే ఆన్ వై నగరంలో ఇక్కడ అవుట్ డోర్ స్టోర్ లో కొత్త పాత పుస్తకాలు లభిస్తాయి.

మాస్కోలోని కేఫ్ పుష్కిన్.. ఇక్కడ మంచి రష్యా, ఫ్రెంచ్ పుస్తకాలు లభిస్తాయి. నగరంలోని అతి పెద్ద లైబ్రరీ ఇది.

చైనా యాంగ్ జౌలో జాంగ్ షుగె లైబ్రరీ.. నల్ల అద్దంలా మెరిసే మెట్లతో ఒక ధనస్సు ఆకారంలో ఈ లైబ్రరీ ఉంది.