12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లో కామర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు బిబిఎ, బికాం, సిఎ, సిఎస్ లాంటి కోర్సులు ఉన్నాయి.

ఇందులో బికాం ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ కోర్సు చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు.

బికాం డిగ్రీ ఉంటే అకౌంటింగ్ , ఫైనాన్షియల్  కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

చార్డర్ట్ అకౌంటెన్సీ లేదా సిఏ కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

సిఏ చేసిన వారికి అధిక వేతనాలు లేదా సొంతంగా ప్రాక్టీసు చేసుకోవచ్చు.

సిఏ లాగే కంపెనీ సెక్రటరీ అంటే సిఎస్ కూడా చాలా మంచి కోర్సు.

ఫైనాన్స్, బ్యాంకింగ్, ట్యాక్సేషన్ రంగాల్లో సిఎస్ చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది.

సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ కోర్సు కూడా ఉంది.

సిఎంఏ డిగ్రీ ఉన్నవారికి మానుఫ్యాక్చరింగ్ లేదా నిర్మాణ కంపెనీల్లో ప్రాధాన్యం ఉంటుంది.

బిఏ ఎకానామిక్స్ చేస్తే.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, ఫైనాన్స్ కన్సల్టెంట్, ఆడిటర్ లాండి ఉద్యోగాలు లభిస్తాయి.

బిబిఏ, బిబిఎస్ లాంటి కోర్సు చేస్తే మేనేజ్‌మెంట్ సంబంధిత ఉద్యోగావకాశాలు లభిస్తాయి.