దారి తప్పుతున్న ఐటెం సాంగ్స్... కొరియోగ్రాఫర్‌కి చివాట్లు పెట్టినా..?

సోమవారం రాబిన్ హుడ్ నుంచి అదిదా సర్‌‌‌‌ప్రైజు స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. కేతికా శర్మ చేసిన ఈ ఐటెం సాంగ్ వైరల్ అయింది.

అయితే ఈ సాంగ్‌లో కొన్ని స్టెప్స్‌ అసభ్యకరంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సాంగ్‌కి కొరియోగ్రాఫీ చేసిన శేఖర్ మాస్టర్‌పై ఆ స్టెప్స్ ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ముఖ్యంగా హుక్ స్టెప్ అని కేతికాతో ఓ స్టెప్ వేయించారు. దీనికి అయితే... దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.

శేఖర్ మాస్టర్ గతంలో కొరియోగ్రాఫీ చేసిన దబిడి దిబిడి - డాకు మహారాజ్, సితార్ - మిస్టర్ బచ్చన్ సాంగ్స్ పై కూడా ఇలాంటి వ్యతిరేకతే వచ్చింది. (VC : Aditya Music)

దబిడి దిబిడి సాంగ్ కాంట్రవర్సీ అప్పట్లో చాలా ఎఫెక్ట్ చూపించింది. నిర్మాత కూడా స్పందించాల్సి వచ్చింది.

అలాగే సితార్ సాంగ్ పై కూడా అదే వ్యతిరేకత వచ్చింది. రవితేజతో అలాంటి స్టెప్స్ చేయించినందుకు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

అప్పుడు నిర్మాత, డైరెక్టర్ కూడా ఈ వివాదంపై స్పందించారు.

ఇలా తన కొరియోగ్రాఫీ పైన బ్యాక్ టూ బ్యాక్ కాంట్రవర్సీ అవుతున్నా... శేఖర్ మాస్టర్ ఏం మాత్రం మారకుండా... సేమ్ అదే అసభ్యకరమైన స్టెప్స్ వేయిస్తున్నాడు.

ఇప్పుడు ఈ అదిదా సర్‌‌‌‌ప్రైజు ఐటెం సాంగ్‌తో మరోసారి శేఖర్ మస్టార్‌కు నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు.