ఏది నిజం? యుద్ధంపై వస్తున్న ఫేక్ వార్తలివే!

Fake: పాకిస్తాన్‌తో వార్ నేపథ్యంలో ఏటీఎంలు మూసివేస్తున్నారని ప్రచారం.

True: ఏటీఎంల మూసివేత వార్తలు ఫేక్ అని పీఐబీ స్పష్టం చేసింది.

Fake: గుజరాత్‌లోని పోర్టుపై దాడి జరిగిందంటూ వైరల్ అయిన వీడియోలు.

True: ఆ వీడియోలు 2021లో ఆయిల్ ట్యాంకల్ పేలుడుకు సంబంధించినవన్న పీఐబీ.

 Fake: ఇండియాకు చెందిన రఫెల్ యుద్ధ విమానాన్ని పాక్ కూల్చివేసినట్లు ఫొటోలు వైరల్.

True: అవి గతంలో కూలిన మిగ్ 21 ఫైటర్ జెట్‌కు సంబంధించినవి స్పష్టం చేసిన  పీఐబీ.

Fake: ముజఫరాబాద్‌లో సుఖోయ్ Su-30MKI విమానం కూల్చేసినట్లు పాక్ మీడియా అసత్య ప్రచారం.

True: 2013లో కూలిపోయిన Su-30MKI విమానానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారన్న  పీఐబీ.

Fake: కాశ్మీర్‌లో కనీసం 3 ఇండియన్ జెట్‌ ఫైటర్స్  కూల్చేసినట్లు పాక్ మీడియా ప్రచారం.

True:  ఆ వీడియోలు 2019లో కూలిన జెట్ ఫైటర్స్‌కు సంబంధించినవన్న  పీఐబీ.

 Fake: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ చక్కర్లు కొడుతోంది.

True: అజిత్ దోవల్ పేరిట ఫేస్ బుక్ అకౌంట్ లేనట్లు స్పష్టం చేసిన పీఐబీ.

Fake: భారత్‌పై పాక్ క్షిపణి దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్.

True:  2020లో లెబనాన్‌లో జరిగిన పేలుడును ప్రస్తుతం వైరల్ చేస్తున్నారన్న పీఐబీ.