గోంగూర తింటే.. ఆరోగ్య ప్రయోజనాలు మామూలుగా ఉండవు..!

గోంగూర తినడం వల్ల శరీరంలో అనేక వ్యాధులను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దీనిలో విటమిన్ ఏ, సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం వంటి వాటితో బాధపడే వారు గోంగూరను తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

గోంగూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.

ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో బరువు కూడా తగ్గుతారు.

ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో గోంగూర తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

ఎముకలను దృఢంగా ఉంచడంలో, విరిగిన ఎముకలు త్వరగా అతుకునేలా చేయడంలో గోంగూర ఉపయోగపడుతుంది.

గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి.

గోంగూర ఆకుల పేస్ట్‌ను తలకు పట్టించి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్య తగ్గుతుంది.