బరువు తగ్గడానికి చాలామంది రోటీలు తింటుంటారు.

నూనెతో చేసే రోటీలకు బదులు చుక్కా రోటీలను ఎక్కువగా తింటారు.

చుక్కా రోటీలను గ్యాస్ స్టవ్ మంటపై కాల్చుతారు. దానివల్ల బాగా ఉబ్బి రుచిగా ఉంటాయి.

ఇవి తినేందుకు బాగానే ఉంటాయి. కానీ, ఆరోగ్యానికి మాత్రం మంచివి కావట.

ఎందుకంటే.. గ్యాస్ మంటలో కార్సినోజిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండటమే.

గ్యాస్ మంటలో హానికరమైన పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి.

గ్యాస్ మంటలో ఇంకా హెటెరోసైక్లిక్ అమైన్లు కూడా ఉత్పత్తి అవుతాయట.

గ్యాస్ మంటపై కాల్చేప్పుడు అవన్నీ రోటీలోకి చేరి ప్రమాదకరంగా మారతాయి.

ఆ రోటీలను తింటే భవిష్యత్తులో క్యాన్సర్లకు గురయ్యే ప్రమాదం ఉందట.