మీరు వేగంగా భోజనం చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

నేటి బీజీ షేడ్యుల్‌లో ప్రతిదీ హడావిడిగా మారిపోయింది. తినడానికి కూడా టైం లేనట్టుగా వేగంగా తింటున్నారు.

వేగంగ భోజనం చేయడం వల్ల ఆహారం కడుపులో జీర్ణం కాదు.

వేగంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.

మనం తినే ఆహారం బాగా నమిలి తినడం వల్ల  బాగా జీర్ణమవుతుంది. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి.

అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇలా వేగంగా తినే వారు మెటబాలిక్ సిండ్రోమ్‌ను కలిగి ఉంటారు. ఇది వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ డయాబెటిస్ వంటి జబ్బులకు దారితీస్తుంది.

బాగా ఆకలి వేసినప్పుడు తింటే గబగబ తింటారు.. కావున ఆకలి వేయకముందే తినడం వల్ల నెమ్మదిగి తింటారు.

భోజనం చేసేటప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్లతో కలిసి తినడం వల్ల నెమ్మదిగా తింటారు.

ఫోన్, టీవీలు చూస్తూ భోజనం చేయడం మానుకోండి. ఆహారం బాగా నమిలి తినడం అలవాటు చేసుకోండి.