తరచూ అలసిపోతున్నారా? గుండె దడగా ఉంటుందా? అయితే తస్మాత్ జాగ్రత్త..

చాలా మంది సరైన శక్తి లేక ఊరికే అలసిపోతుంటారు.. చిన్న దానికే గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొన్ని సమస్యల వల్ల ఇలా ఉంటుందని చెబుతున్నారు.

సరిగ్గా నిద్రపోకపోతే, శరీరానికి విశ్రాంతి దొరకదు, దీంతో అలసట కలుగుతుంది.

అలాగే శరీరానికి తగినంత నీరు లేకపోవడం వల్ల, శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయవు.

మీరు తింటున్న ఆహారంలో సరైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

శరీరంలో ఐరన్ లోపం ఉంటే నీరసం, అలసటగా ఉంటుంది.

క్యాన్సర్ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అంటున్నారు.

కావున నీరు ఎక్కువగా తాగాలి, తినే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచాలి, ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

ప్రతి రోజూ 7-8 గంటలు నిద్రపోవడం మంచిది.

మీకు అలసట చాలా ఎక్కువైతే  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.