వేసవిలో చల్లగా ఉంటుందని ఐస్ క్రీమ్ తింటున్నారా..! అయితే ఇది మీరు తెలుసుకోవాలి

వేసవిలో ఐస్‌క్రీమ్ తింటే శరీరం చల్లబడుతుందని అనుకుంటారు.. కానీ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

ఐస్‌క్రీమ్ తినడానికి చల్లగ ఉండవచ్చు.. కానీ దాని ప్రభావంలో అది వేడిగా ఉంటుంది.

దీనిలో అధిక కొవ్వు వల్ల శరీరంలో లోపల వేడిని సృష్టిస్తుంది.

అలాగే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు వస్తాయి.

ఐస్‌క్రీమ్ తినడం వల్ల మీ శరీరంలో పోషకాలు సరిగ్గా ఉండవని అంటున్నారు.

దీనిలో చక్కెర అధికంగా ఉంటుంది. అలాగే కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది.

ఐస్‌క్రీమ్ తినడం వల్ల  కడుపునొప్పి సమస్యలను కూడా కలిగిస్తుంది.

అధికంగా ఐస్‌క్రీమ్ తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.

ఐస్‌క్రీమ్లో అధిక కొవ్వు మరియు చక్కెరలు ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

 పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం.