మీ కళ్లు కత్తిలా పనిచేయాలంటే.. ఇవి ఫుడ్ తినండి చాలు

ఫోన్లు.. టీవీ, కంప్యూటర్ స్క్రీన్లు ఎక్కువగా చూడటం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి.

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కంటి సమస్యలు వస్తున్నాయి.

కంటిశుక్లం తదితర సమస్యలు రాకూడదంటే విటమిన్-సి కలిగిన ఆహారం తీసుకోవాలి.

నారింజ వంటి పుల్లని పండ్లను వారంలో కనీసం మూడుసార్లు తీసుకోండి.

క్యారెట్‌లో విటమిన్-ఎ పుష్కలం. కాబట్టి.. వారంలో కనీసం రెండుసార్లు తినండి.

మొక్క జొన్నలు, స్ట్రాబెర్రీస్, టమోటో, గుమ్మడిలోనూ విటమిన్ సి, ఎ ఉంటాయి.

పిల్లలకు ఆకు కూరలు బాగా తినిపించాలి. దానివల్ల భవిష్యత్తులో కంటి సమస్యలు దరిచేరవు.

బచ్చలి, కాలే తదితర ఆకు కూరల్లో కంటిని రక్షించే విటమిన్-సి, ఇ ఉంటాయి.

బీన్స్, చిక్కుళ్లు కూడా కంటి చూపుకు మేలు చేస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-E ఎక్కువగా ఉండే సన్ ఫ్లవర్ విత్తనాలు, నట్స్ కూడా కంటికి మంచివే.

చిక్కుళ్లలోని బయోఫ్లావనాయిడ్స్ కంటి రెటీనాను కాపాడతాయి.