చర్మంపై ముడతలు రావడం చాలా సహజం. అయితే కొందరికి తక్కువ వయసులోనే వస్తాయి.
దీనికి కారణం జన్యు లోపాలు, స్మోకింగ్, ఎండలో ఎక్కువ గడపడం లాంటివి ఉన్నాయి.
అందుకేముడతలు రాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి
ఎండలో వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ క్రీమ్ తప్పక ఉపయోగించండి.
వయసు పెరిగే కొద్ది చర్మంలో తేమ శాతం తగ్గిపోతుంది. అందుకే మాస్చరైజర్స్ ఉపయోగించాలి.
శరీరంలో నీటి శాతం తగ్గినా చర్మం ముడతలు పడుతుంది. అందుకే బాగా నీరు తాగాలి.
అత్యధిక యాంటి ఆక్సిడెంట్స్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న ఫుడ్స్ వాల్‌నట్స్, చేప లాంటి తినాలి.
మానసిక ఒత్తిడితో శరీరంలో హానికరమైన కార్టిసోల్ ఉత్పత్తి జరుతుంది. ఇది చర్మపై ముడతల ఏర్పాటకు కారణమవుతుంది.
మరీ ఎక్కువగా ఫేస్ వాష్ చేయకూడదు. అలా చేస్తే ముఖం పొడిబారిపోతుంది. జెంటిల్ క్లిన్సర్ ఉపయోగించండి.
స్మోకింగ్ ఎక్కువగా చేసేవారికి చర్మంపై ముడతలు త్వరగా వస్తాయి.
మద్యపానం శరీరంలో నీటి శాతాన్ని తగ్గించేస్తుంది. అందుకే స్మోకింగ్, డ్రింకింగ్ కు దూరంగా ఉండండి.
నారింజ ఎప్పుడు పడితే అప్పుడు తింటే.. మీ ఆరోగ్యం మటాష్..