నారింజ ఎప్పుడు పడితే అప్పుడు తింటే.. మీ ఆరోగ్యం మటాష్..

నారింజ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది నిమ్మ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయిలానే సిట్రస్ జాతికి చెందిన పండు.

విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.

దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచుతుంది, దీంతో అనేక వ్యాధుల నుంచి బయటపడతారు.

ఈ పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఆరెంజ్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే కడుపులో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఖాళీ కడుపుతో లేదా రాత్రి పూట ఎప్పుడు నారింజ పండు తినకూడదు.

ఖాళీ కడుపులో నారింజ తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. అయితే, ఇది గ్యాస్ సమస్యల్ని కలిగిస్తుంది.

రాత్రి పూట తింటే ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.

నారింజ పండును మధ్యాహ్నం తినడం మేలు అంటున్నారు నిపుణులు.

లేదంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.