ఇంటర్‌వ్యూ అంటే కేవలం ఒక జాబ్ ప్రాసెస్ కాదు. అది మీ జీవితం మార్చేసే ఛాన్స్.

మీ టాలెంట్ ని బలంగా చూపించుకొని సరైన ఉపాధి పొందే అవకాశం.

అందకే ఇంటర్‌వ్యూలో సక్సెస్ సాధించడానికి కొన్ని టిప్స్ మీ కోసం

కంపెనీ కల్చర్ కు తగ్గట్టు ఒక సరైన డ్రెస్ ధరించడం తప్పనిసరి

సమయానికి ఇంటర్‌వ్యూకి వెళ్లడం మీ క్రమశిక్షణని తెలుపుతుంది.

కంపెనీ లక్ష్యాల గురించి ముందే తెలుసుకొని వాటి కోసం మీరు పాటుపడగలరు అని చెప్పాలి.

ఇంటర్‌వ్యూలో కాన్ఫిడెన్స్ గా కనిపించాలి. కూర్చోవాలి. కళ్లలో సూటిగా చూస్తూ మాట్లాడాలి.

తరుచూ అడిగే ప్రశ్నలకు ముందుగానే ఏం సమాధానం చెప్పాల్లో బాగా ప్రాక్టీస్ చేయండి.

మీరు గత కంపెనీలో ఏం పని చేశారు. మీ అనుభవం ఎలా కొత్త కంపెనీకి ఉపయోగపడుతుందో వివరించండి.

కంపెనీ పనితీరు గురించి ఆసక్తికర ప్రశ్నలకు మీరు అడగండి.