వేసవిలో గుడ్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి, ఈ టిప్స్ పాటించండి.

గుడ్లు కొనుగోలు చేసేప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని దుకాణాల్లో గుడ్లను సరిగ్గా నిల్వ ఉంచరు. వారి వద్ద గుడ్లు కొనొద్దు.

రూమ్ టెంపరేచర్ లేదా చల్లగా ఉండే స్టోర్స్‌లోనే గుడ్లు కొనాలి.

గుడ్లకు పగుళ్లు ఉంటే అస్సలు కొనుగోలు చేయొద్దు.

గుడ్లను ఇంటికి తీసుకురాగానే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. కాసేపు బయట ఉంచాలి.

గుడ్లను ఫ్రిజ్‌లో ఎప్పుడూ 40 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాలి.

గుడ్లను అస్సలు కడగకూడదు. పెంకులు నీటిని పీల్చుకుని గుడ్డులోకి చేరుతాయి.

ఉడకించిన గుడ్లను ఫ్రిజ్‌లో నిలువ చేయొద్దు.

గుడ్లలో వెడల్పుగా ఉండే ప్రాంతాన్ని పైకి.. సన్నగా ఉండే ప్రాంతాన్ని కిందికి పెట్టాలి. Images Credit: Pixabay