సమ్మర్ స్పేషల్ సీమ చింతకాయలు... తింటే ఆరోగ్యమే ఆరోగ్యం..

సీమ చింతకాయలు.. వేసవిలో మాత్రమే లభించే ఈ కాయ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు.

గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే సీమ చింతకాయలు తియ్యగా, వగరుగా ఉంటాయి.

సీమ చింతకాయ గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది.

దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

ఈ కాయలు తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.

ఇవి జ్ఞాపకశక్తి, మానసిక స్థితి మరియు ఏకాగ్రతను పెంచుతుంది.

దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది, గర్భీణీ స్త్రీలకు మంచి పోషకాలను అందిస్తుంది. తల్లితో పాటు పుట్టబోయో బిడ్డ ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి.

 క్షయ వ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి.

సీమ చింతకాయలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.