విమానం ఎక్కుతున్నారా? అయితే, జీన్స్ వేసుకోకండి.

అదేంటీ? విమానానికి.. జీన్స్‌కు సంబంధం ఏమిటీ? అనేగా మీ సందేహం?

విమానంలో టైట్‌గా ఉండే జీన్స్, లెగ్గింగ్స్ ధరించకూడదట.

ఎందుకంటే.. విమానం గాల్లో ఎగిరేప్పుడు వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి.

అలాంటి పరిస్థితుల్లో బిగువు దుస్తులు.. రక్త ప్రవాహానికి ఆటంకంగా మారొచ్చు.

టైట్ జీన్స్ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. ఈ సమస్యను డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు.

అలాగే విమానం ఎక్కేప్పుడు మెటల్ డిజైన్స్ ఉన్న షూస్ ధరించకూడదు. భద్రతా సమస్యలు వస్తాయి.

అలాగే విమానం ఎక్కేప్పుడు షార్ట్స్ వేసుకోకూడదు. సీట్లపై ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి చేరవచ్చు. Images Credit: Pixabay and Pexels