Big Stories

RRR: అప్పుడు స్వాతిముత్యం.. ఇప్పుడు RRR.. ఆస్కార్ వేటలో తెలుగు సినిమా..

RRR: తెలుగు సినిమా. మనమెంతో గర్వంగా చెప్పుకునే మన సినిమా. ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది. ఇప్పుడు యావత్ దేశం టాలీవుడ్ వైపే చూస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసింది మనమే. అర్జున్ రెడ్డితో హద్దులు చెరిగిపోయాయి. తెలుగు సినిమా అయినా పరభాషీయులూ ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. ఓటీటీలో దుమ్ములేచింది. ఇక బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సినిమాకు టాలీవుడ్ ను కింగ్ గా చేశారు రాజమౌళి. ఆ టెంపోను అలా కంటిన్యూ చేస్తూ RRRతో మరోమారు మెస్మరైజ్ చేశారు జక్కన్న. ఇప్పటికే భారత్ ను జయించేసి.. ఇప్పుడు ప్రపంచ జైత్రయాత్ర చేస్తోంది త్రిబుల్ ఆర్ బృందం. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ ను కొల్లగొట్టి.. ఆస్కార్ వేటకు రెడీగా ఉంది.

- Advertisement -

ఓ తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్ వరకూ చేరడం మామూలు విషయం కాదు. ఇప్పటి వరకూ గొప్ప చరిత్ర గల మన ఇండియన్ సినిమా నుంచి మూడంటే మూడు మాత్రమే ఆస్కార్ నామినేషన్ సాధించాయి. మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ లు గతంలో ఆస్కార్ బరిలో నిలిచాయి. ఇప్పుడు నాలుగో చిత్రంగా మన తెలుగు సినిమా.. మన రాజమౌళి సినిమా.. మన చరన్, తారక్ ల సినిమా.. RRR నాటు నాటు సాంగ్ నామినేట్ అవడం తెలుగు వారిగా మనందరికీ గర్వకారణం. మన కీరవాణికి ఆస్కార్ గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

అయితే, టాలీవుడ్ చరిత్రలో మరో ఆస్కార్ మైలురాయి కూడా ఉంది. నామినేషన్ కు ఎంపిక కాకపోయినా.. గతంలో ఆస్కార్ షార్ట్ లిస్ట్ వరకూ వెళ్లిందో తెలుగు సినిమా. అదే కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’. అవును, కమలహాసన్, రాధిక జంటగా నటించిన స్వాతిముత్యం చిత్రం అప్పట్లో ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో నిలిచింది. అవార్డుకు నామినేట్ మాత్రం కాలేకపోయింది.

ఆనాటి మన స్వాతిముత్యం సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి.. మన RRR ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో తుది జాబితాలో చోటు దక్కించుకోవడం తెలుగువారి కీర్తిని మరింత పెంచింది. ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కీరవాణి సంగీతం సమకూర్చిన నాటు నాటు పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, కాలభైరవ-రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ డ్యాన్స్ కంపోజ్ చేశారు.

‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ వరిస్తే… జయహో తెలుగోడా అనాల్సిందే ఎవరైనా. ఎనీ డౌట్స్?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News